కరీంనగర్ · May 14, 2026

కరీంనగర్ ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలలో ప్రవేశాల పోస్టర్ విడుదల: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట, వి90 న్యూస్, మే 14: కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ మరియు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో (ATC) విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ( దిలీప్) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు సాంకేతిక నైపుణ్యాలను అందించి ఉపాధి మార్గాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోందని పేర్కొన్నారు. ప్రైవేట్ ఐటీఐలతో సమానంగా, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏటీసీలలో కూడా అత్యాధునిక కోర్సులను ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు.కరీంనగర్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ కె. అశోక్ కుమార్ ఈ ప్రవేశాల ప్రక్రియపై స్పష్టతనిస్తూ.. ఐటీఐలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA), డ్రెస్ మేకింగ్, వెల్డర్ వంటి సంప్రదాయ కోర్సులతో పాటు, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ కోర్సులను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఐవోటీ టెక్నీషియన్ (స్మార్ట్ అగ్రికల్చర్), వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, అడ్వాన్స్‌డ్ సీఎస్సీ టెక్నీషియన్, మ్యానుఫాక్చరింగ్ ప్రాసెసింగ్ ఆటోమేషన్ కంట్రోల్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ , ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ వంటి అధునాతన విభాగాల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చని సూచించారు.పదవ తరగతి (SSC) ఉత్తీర్ణులైన ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 8వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. దరఖాస్తుదారులు https://iti.telangana.gov.in వెబ్‌సైట్ సందర్శించి 100 రూపాయల రుసుము చెల్లించి తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఎండి ఫిరోజ్ తో పాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొని ఈ అవకాశాన్ని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor