కరీంనగర్ · May 14, 2026

ఎండీ సలీం పాషా మృతి పట్ల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంతాపం: కుటుంబ సభ్యులకు పరామర్శ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట, వి90 న్యూస్ మే 14 : జమ్మికుంట పట్టణ సీనియర్ నాయకుడు ఎండీ సలీం పాషా హఠాన్మరణం పట్ల హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సలీం పాషా మృతి వార్త తెలియగానే జమ్మికుంట సివిల్ హాస్పిటల్‌కు చేరుకున్న ఎమ్మెల్యే, అక్కడ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సలీం పాషా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే, వారిని ఓదారుస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఎండీ సలీం పాషా మరణం పార్టీకి , పట్టణానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే భగవంతుడిని ప్రార్థించారు. ఈ అత్యంత కష్టసమయంలో సలీం పాషా కుటుంబానికి తాను వ్యక్తిగతంగా అన్ని విధాలా అండగా ఉంటానని, ఏ అవసరం వచ్చినా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ దిలీప్ , పలువురు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor