కరీంనగర్ · May 15, 2026

జమ్మికుంట మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ , మార్కెట్ చైర్ పర్సన్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట,వి90 న్యూస్,మే 15 : స్థానిక కాటన్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందంతో కలిసి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డుకు వస్తున్న మొక్కజొన్న నాణ్యతను పరిశీలించడమే కాకుండా, కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరును వారు స్వయంగా పర్యవేక్షించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని, మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా తేమ శాతం విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా రవాణా ఏర్పాట్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. మార్కెట్ కమిటీ తరపున రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సమకూరుస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది , స్థానిక రైతులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor