కరీంనగర్ · May 16, 2026

పోలీస్ గేమ్స్ లో అద్భుత ప్రతిభ: హుజూరాబాద్ ఏసిపి వి. మాధవికి మాస్టర్ క్రీడాకారుల ఘన సన్మానం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హుజురాబాద్, వి90 న్యూస్,మే 16: ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించిన అఖిల భారతీయ పోలీస్ క్రీడా పోటీల్లో హుజూరాబాద్ ఏసిపి వి. మాధవి అసాధారణ ప్రతిభను కనబరిచారు. టేబుల్ టెన్నిస్, బ్యాట్మింటన్ విభాగాల్లో ఆమె అద్భుతమైన ఆటతీరుతో రాణించి బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ అద్భుత విజయానికి గాను శనివారం హుజురాబాద్ లోని ఆమె కార్యాలయంలో మాస్టర్ క్రీడాకారులు ఏసిపిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమెకు శాలువా కప్పి, పూలగుచ్ఛాన్ని అందజేసి ఘనంగా సన్మానిస్తూ తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సన్మాన కార్యక్రమం సందర్భంగా మాస్టర్ క్రీడాకారులు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో అత్యంత బాధ్యతాయుతమైన విధినిర్వహణలో నిరంతరం బిజీగా ఉంటూ, ప్రజలకు సేవలందించడంతో పాటు క్రీడలపై ఉన్న మక్కువతో నిరంతరం సాధన చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి బిజీ షెడ్యూల్‌లోనూ జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి బంగారు పతకాలు సాధించడం అందరికీ ఎంతో గర్వకారణమని ప్రశంసించారు. ఏసిపి మాధవి సాధించిన ఈ విజయం కేవలం మహిళలకే కాకుండా, నేటి యువతరం అందరికీ ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. క్రీడలు అనేవి కేవలం మానసిక ఉల్లాసానికే పరిమితం కాకుండా, సమాజంలో తమలో దాగి ఉన్న అద్భుత నైపుణ్యాన్ని రుజువు చేసుకోవడానికి ఒక గొప్ప వేదికగా ఉపయోగపడతాయని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.ఈ ఘన సన్మాన కార్యక్రమంలో రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ మారేపల్లి మొగిలయ్య, అంతర్జాతీయ క్రీడాకారులు వంతడుపుల రఘుతో పాటు ప్రముఖులు డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు), మంద జగన్, మామిండ్ల మల్లయ్య తదితరులు పాల్గొని ఏసిపి మాధవిని అభినందించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor