కరీంనగర్ · May 17, 2026

కౌన్సిలర్ ఒగ్గు రమేష్‌ను పరామర్శించిన కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట, వి90 న్యూస్ ,మే 17 :జమ్మికుంట పట్టణంలోని 28వ వార్డు కౌన్సిలర్ ఒగ్గు రమేష్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మండలంలోని మడిపల్లి గ్రామంలో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న కాజీపేట ఏసీపీ, నిత్య జనగణమన రూపకర్త పింగిలి ప్రశాంత్ రెడ్డి ఆదివారం నాడు జమ్మికుంటలోని కౌన్సిలర్ ఒగ్గు రమేష్ నివాసానికి వెళ్లారు. అక్కడ కౌన్సిలర్ రమేష్‌ను మరియు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె మృతికి గల కారణాలను, అనారోగ్య వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రమేష్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో రాజిరెడ్డి, ప్రభాకర్ రావుతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor