జమ్మికుంటలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి: సాంకేతిక విప్లవానికి ఆద్యుడు ఆయనే

0
1005581917

జమ్మికుంట,వి90 న్యూస్,మే 21: భారత దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం జమ్మికుంట పట్టణంలో ఘనంగా జరిగింది. జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీచౌరస్తాలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దేశీని కోటి, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ములుగురి సదయ్యలు మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ అతిపిన్న వయసులోనే దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టి అద్భుతమైన సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు. ముఖ్యంగా సాంకేతిక, టెక్నాలజీ రంగాల్లో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణల వల్లనే ఈరోజు మనం టెలిఫోన్లు, సెల్ ఫోన్లు మరియు ఇంటర్నెట్‌ను విస్తృతంగా వాడుకోగలుగుతున్నామని స్పష్టం చేశారు. నాడు ఓటు హక్కు వయోపరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు కుదించిన ఘనత కూడా రాజీవ్ గాంధీ కే దక్కుతుందని వారు గుర్తుచేశారు. దేశానికి యువతే వెన్నుముక అని నమ్మిన ఆయన, యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసమే నేడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు, కార్యక్రమాలు చేస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలందరూ క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పనిచేసి రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.ఈ నివాళులర్పించిన వారిలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, దుబ్బ మల్లన్న, చైర్మన్ ముద్దమల్ల రవీందర్, మార్కెట్ డైరెక్టర్ రాజేశ్వరరావు, కౌన్సిలర్ చందా రాజు, కుదాడి తిరుపతి, మాచర్ల రాజు, ఉగ్గు రమేష్, పాతకాల అనిల్ పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు పొనగంటి రవీందర్, బొంగోని వీరన్న, రామ్ రెడ్డి, పంజాల అజయ్, దొడ్డ శ్రీకాంత్, పొనగంటి మధు, మైనార్టీ సెల్ అధ్యక్షులు సలీం, యూత్ కాంగ్రెస్ నాయకులు గంగారపు మహేష్, ఎలగందల శ్రీహరి, దేవనూరు వినయ్, లింగారావు, పోతుల శ్రీనివాస్, చిన్నింటి నాగేందర్, పవన్, ప్రవీణ్, ప్రసాద్ తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీ కి తమ ఘన నివాళులు అర్పించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed