కరీంనగర్ · May 23, 2026

జమ్మికుంట మున్సిపల్ కమిషనర్‌కు పద్మశాలి సంఘం నాయకుల ఘన సన్మానం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట, వి90 న్యూస్, మే 23: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన మున్సిపల్ కమిషనర్ల బదిలీల్లో భాగంగా జమ్మికుంటకు నూతనంగా విచ్చేసిన కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామిని చేనేత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలు పద్మ ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణ కీర్తి ప్రతిష్టలను రాష్ట్రవ్యాప్తంగా మరింతగా చాటిచెప్పేలా నూతన కమిషనర్ తన విధులను నిర్వహించాలని ఆకాంక్షించారు. పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం, స్థానిక సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ యంత్రాంగానికి తమ వంతుగా ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా పద్మ స్పష్టం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor