జమ్మికుంటలో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో మహిళలకు ఘనంగా చీరల పంపిణీ

0
IMG-20260525-WA0030

జమ్మికుంట,వి90 న్యూస్, మే 25: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలకు చీరలను అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మల్లికార్జున స్వామి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలోని పొదుపు సంఘాల మహిళా సభ్యులతో పాటు, సంఘాలలో లేని ఇతర అర్హులైన మహిళలందరికీ ఈ చీరలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ పంపిణీ ప్రక్రియ మహిళలకు మరింత సులభతరం చేసేందుకు వారి వారి వార్డుల్లోనే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం రాబోయే మరో మూడు రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్ మాచర్ల రాజు, వార్డు ఆఫీసర్ గోపి భాస్కర్, గుంటి సాయికృష్ణలతో పాటు సీఎల్ఆర్‌పీలు జ్యోతి, మంజుల, ఆర్పీలు సరళ, రజిత , పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed