కరీంనగర్ · May 25, 2026

ఇల్లందకుంట పీఎం శ్రీ పాఠశాలలో ఘనంగా సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు: విద్యార్థులకు బహుమతుల ప్రధానం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ఇల్లందకుంట,వి90 న్యూస్, మే 25: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 15 రోజులుగా కొనసాగుతున్న సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ క్యాంప్‌లో మండలంలోని 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గల విద్యార్థులకు లాంగ్వేజ్ స్కిల్స్, కూచిపూడి నృత్యం, ఆర్ట్ అండ్ డ్రాయింగ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ముగింపు ఉత్సవాల సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తస్లీమ్ నస్మీన్ మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్‌లు విద్యార్థుల మానసిక, శారీరక ఉల్లాసానికి, వారిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నలుగురు ప్రత్యేక శిక్షకుల ద్వారా విద్యార్థులకు కూచిపూడి, కర్సివ్ రైటింగ్, చెస్, క్యారమ్స్, షటిల్ వంటి ఇండోర్ గేమ్స్‌లో స్వేచ్ఛాయుత వాతావరణంలో శిక్షణ ఇచ్చామని, పిల్లలు చాలా చురుగ్గా పాల్గొన్నారని కొనియాడారు. అలాగే తమ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన జరుగుతోందని, పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించామని తెలిపారు. స్కూల్‌లో కంప్యూటర్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, డిజిటల్ బోర్డులతో పాటు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వం ద్వారా ప్రతి విద్యార్థికి 21 వస్తువులతో కూడిన ఉచిత కిట్ బ్యాగును అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

ఈ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఇల్లందకుంట మండల విద్యాధికారి కే. రాములు మాట్లాడుతూ పీఎం శ్రీ పాఠశాలలో నిర్వహించిన ఈ సమ్మర్ క్యాంప్‌లో మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులంతా పాల్గొని ప్రత్యేక శిక్షణ పొందడం అభినందనీయమన్నారు. నిపుణులైన ఇన్‌స్ట్రక్టర్ల ద్వారా విద్యార్థులకు లలిత కళలు, క్రీడల్లో మంచి నైపుణ్యాలు నేర్పించారని ఆయన తెలిపారు. ఈ అద్భుతమైన ముగింపు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తస్లీమ్ నస్మీన్, ఎంఈఓ కే. రాములుతో పాటు ఉపాధ్యాయులు కే. జయప్రకాష్, సీహెచ్. వేణు, కే. శంకర్, సమ్మర్ క్యాంప్ శిక్షకులు శ్రీమన్నారాయణ, సహశ్రీ, ధ్రువంశ్, రాజేందర్, విద్యార్థులు , వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor