ఆంధ్ర ప్రదేశ్ · May 25, 2026

రావులపాలెంలో క్లస్టర్ మహానాడు పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు: విజయవంతం చేయాలని తెలుగు తమ్ముళ్లకు పిలుపు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కొత్తపేట,వి90 న్యూస్, మే 25: ఈనెల 27, 28 తేదీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న తెలుగుదేశం పార్టీ క్లస్టర్ మహానాడును ఘనంగా విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. మహానాడు కార్యక్రమాలకు సంబంధించిన అధికారిక గోడ పత్రికను (పోస్టర్) సోమవారం రావులపాలెంలోని తన నివాస క్యాంపు కార్యాలయంలో యువ నాయకుడు బండారు సంజీవతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఈ మహానాడు ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. క్లస్టర్ల వారీగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి, భవిష్యత్ కార్యాచరణను శ్రేణుల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఈ క్లస్టర్ మహానాడు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor