ఆంధ్ర ప్రదేశ్ · May 25, 2026

తర్లుపాడు మండలంలో రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కలెక్టర్ విజయ సునీత

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ప్రకాశం,వి90 న్యూస్,మే 25: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల పరిధిలోని మేకలవారిపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూ.15 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ (MSME) ఇండస్ట్రియల్ పార్కును మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి , జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలుజువ్వలపాడు గ్రామ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామిక పార్కుతో వెనుకబడిన ఈ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాది పడిందని హర్షం వ్యక్తం చేశారు. దీనికి తోడుగా కొనకనమిట్ల మండలంలో దాదాపు 3 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రస్తుతం అత్యంత చురుగ్గా సాగుతున్నాయని ప్రజాప్రతినిధులు, అధికారులు వెల్లడించారు. ఈ పారిశ్రామిక ప్రాజెక్టులు త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయని, దీనివల్ల స్థానిక యువతకు వేలాది సంఖ్యలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక మండల అధికారులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor