రేపటి నుండి జమ్మికుంట పత్తి మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్లు యధావిధి: మార్కెట్ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం

0
IMG_20260525_204326

జమ్మికుంట, వి90 న్యూస్, మే 25: జమ్మికుంట పత్తి మార్కెట్ యార్డులో రేపటి (మంగళవారం) నుంచి మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోళ్లు యధావిధిగా ప్రారంభం కానున్నట్లు మార్కెట్ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న – సదానందం మీడియా ద్వారా వెల్లడించారు. మక్కలు పండించిన రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని గమనించాలని ఆమె కోరారు. మే 26వ తేదీ మంగళవారం నుండి మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, రైతులు తాము పండించిన మక్కలను నేరుగా జమ్మికుంట పత్తి మార్కెట్‌కు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర అయిన క్వింటాలుకు రూ. 2400/- చొప్పున మార్క్‌ఫెడ్ వారికి అమ్ముకోవచ్చని సూచించారు. రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా, నేరుగా మార్కెట్ యార్డుకు వచ్చి ప్రభుత్వ నిర్ణీత ధరకు తమ పంటను విక్రయించి లబ్ధి పొందాలని చైర్‌పర్సన్ స్వప్న సదానందం పిలుపునిచ్చారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed