ఆంధ్ర ప్రదేశ్ · May 26, 2026

సమయస్ఫూర్తితో నిండు ప్రాణాన్ని కాపాడిన కాచిగూడ పోలీసులు: ఆత్మహత్యాయత్నం భగ్నం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90 న్యూస్,మే 26: పోలీసుల తక్షణ అప్రమత్తత, సమయస్ఫూర్తి కారణంగా కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఒక యువకుడి ప్రాణం తృటిలో కాపాడబడింది. ఆంధ్రప్రదేశ్ నుండి ఓ తండ్రి ఇచ్చిన సమాచారంతో నిమిషాల వ్యవధిలో స్పందించిన పోలీసులు, ఆత్మహత్యకు సిద్ధమైన యువకుడిని సురక్షితంగా రక్షించారు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిరంజన్ (24) అనే యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి, కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన అతని తండ్రి, ఆందోళనతో వెంటనే కాచిగూడ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. తన కుమారుడు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడుతున్నాడంటూ ఆయన ఫోన్ లో ఆవేదన వ్యక్తం చేశారు.తండ్రి నుండి ఫోన్ రాగానే కాచిగూడ పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యంత వేగంగా స్పందించారు. వెంటనే రైల్వే స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ప్లాట్‌ఫారమ్ నంబర్ 5పై ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న నిరంజన్‌ను పోలీసులు సకాలంలో గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. తృటిలో ప్రాణాపాయం నుండి యువకుడిని కాపాడి, కౌన్సిలింగ్ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. పోలీసుల ఈ తక్షణ స్పందన మరియు చాకచక్యంపై నిరంజన్ కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు, ప్రయాణికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor