క్రైమ్ · May 26, 2026

కొంపల్లిలో ఘోరం: మహిళా షాప్ యజమానిపై దారుణంగా దాడి చేసి చైన్ స్నాచింగ్ యత్నం.. నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90 న్యూస్,మే 26: హైదరాబాద్‌లోని కొంపల్లి జయభేరి కాలనీలో దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానికంగా ఆయిల్ షాప్ నిర్వహిస్తున్న ఒక మహిళా యజమానురాలిపై ఒంటరిగా ఉన్న సమయం చూసి ఓ దుండగుడు అత్యంత దారుణంగా దాడి చేసి, ఆమె మెడలోని బంగారు గొలుసును దొంగిలించడానికి ప్రయత్నించాడు. ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.దుండగుడు ఒక్కసారిగా దాడి చేయడంతో షాక్‌కు గురైన బాధిత మహిళ ధైర్యంగా ప్రతీఘటించి, గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల ప్రజలు, స్థానికులు క్షణాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు వెంబడించి పట్టుకున్నారు.

అనంతరం ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి, వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిడివి తక్కువ సమయంలోనే స్పందించి నిందితుడిని పట్టుకున్న స్థానికుల ధైర్యాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor