కరీంనగర్ · May 26, 2026

జమ్మికుంట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కరీంనగర్ సీపీ గౌష్ ఆలం: సాంకేతికత వినియోగం, విజిబుల్ పోలీసింగ్‌పై కీలక ఆదేశాలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట ,వి90 న్యూస్, మే 26: కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం మంగళవారం జమ్మికుంట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు చేరుకున్న సీపీకి జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పూలమొక్కను అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీపీ గౌష్ ఆలం స్టేషన్‌లోని పలు రికార్డులను, ఎఫ్.ఐ.ఆర్ ఇండెక్స్‌ను నిశితంగా పరిశీలించి, పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన CCTNS – 2.0, TS-COP, ఈ-సాక్ష్య, సైబర్ క్రైమ్ టూల్స్, మరియు బాడీ వార్న్ కెమెరాల వంటి ఆధునిక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లపై సిబ్బంది పూర్తి పట్టు సాధించాలని సీపీ సూచించారు. రోజువారీ విధుల్లో ఈ సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని స్పష్టం చేశారు.

అలాగే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జమ్మికుంట పరిధిలోని గ్రామాలను సెక్టార్లు, సబ్-సెక్టార్లుగా విభజించి గ్రామ పోలీస్ అధికారులను కేటాయించాలని ఆదేశించారు.విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సీపీ ఆదేశించారు. పోలీస్ సిబ్బంది విధుల్లో ఎల్లప్పుడూ నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన పాటించాలన్నారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించేలా రిసెప్షన్ నిర్వహణ బాగుండాలని, దీంతో పాటు పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిరంతరం సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో రూరల్ ఇన్స్పెక్టర్ వెంకట్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor