కరీంనగర్ · May 26, 2026

బిజిగీర్ షరీఫ్ దర్గా ఉర్సు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన కరీంనగర్ సిపి గౌసే ఆలం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట వి90 న్యూస్, మే 26: :ఈనెల 28వ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రముఖ బిజీగిర్ షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాల భద్రతా ఏర్పాట్లను కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌసే ఆలం మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసిపి మాధవి, జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్‌లతో కలిసి ఆయన దర్గాను సందర్శించారు. దర్గాలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహమతుల్లా ఆలై, హజ్రత్ సయ్యద్ అజ్మత్ షావలి రహమతుల్లా అలై, హజ్రత్ సయ్యద్ అక్బర్ షావలి రహమతుల్లాఅలై సమాధులను వారు దర్శించుకుని, ప్రత్యేక చాదర్లను సమర్పించారు.

ఈ సందర్భంగా మత గురువు మౌలానా మొహమ్మద్ నౌమాన్ హస్మి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కరీంనగర్ సిపి గౌసే ఆలం మాట్లాడుతూ, బిజిగిర్ షరీఫ్ గ్రామంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉర్సు ఉత్సవాలకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం, రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవాలు ముగిసే వరకు నిరంతర పోలీస్ నిఘా కొనసాగుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజిగిర్ షరీఫ్ గ్రామపంచాయతీ సర్పంచ్ రాచపల్లి వనజ-రాజయ్య, కార్యదర్శి ఇంగ్లీే రాజు, దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌఫీక్ హుస్సేన్, కార్యదర్శి మొహమ్మద్ జమాల్ అష్రాఫ్, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ నయీముద్దీన్, కమిటీ సభ్యులు సర్వర్, అలీ షరీఫ్, అజ్మత్, మాజిద్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor