కరీంనగర్ · May 31, 2026

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనము: ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్ \జమ్మికుంట,వి90 న్యూస్,మే 31: జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ పాఠశాలలో 2000-2001 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక శంకరనందన్ గార్డెన్‌లో అపూర్వ సమ్మేళనము నిర్వహించారు. తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, పదవ తరగతి గదులలో చేసిన చిలిపి చేష్టలు, అల్లరి పనులు, ఉపాధ్యాయులు బోధించిన విషయాలను వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల వేషధారణతో పాఠశాలకు లేటుగా రావడం, ఉపాధ్యాయులు ప్రశ్నలు అడగడం, దండించిన తీరును కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించి అందరినీ అలరించారు. తాము చదువు చెప్పిన విద్యార్థులు నేడు వివిధ రంగాలలో ఉన్నతులుగా ఎదగడం ఎంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గురువులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను పూలమాలలతో ఘనంగా స్వాగతించి, శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో పాఠశాల కరెస్పాండంట్ యెబూషి ఆర్యన్ కౌశిక్, ప్రధానోపాధ్యాయులు యెబూషి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ ఏ బూషి శ్రీనివాస్, మిడిదొడ్డి సమ్మయ్య, మర్రి అవినాష్, వెంకటేశ్వర్లు, మిల్కురి లక్మి నారాయణ, రామూర్తి, చంద్రమౌళి, మధుసూదన్, రాజశేఖర్ పాల్గొనగా, పూర్వ విద్యార్థులు డాక్టర్ ఊడుగుల సురేష్, బిట్ల రమేష్, శీలం మమత, పోనగంటి రవికుమార్, భవాని, ఆకుల సతీష్, జి శ్రీనివాస్, మంజుల, రమేష్, పోనగంటి సతీష్, కిషన్, మహిపాల్, రాములు, స్వప్న, సుప్రజ, శైలజ, సుమన్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor