ఆంధ్ర ప్రదేశ్ · June 1, 2026

హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ: కోర్టును ఆశ్రయించిన జనసేన నేతలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 01: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో రేపు (జూన్ 2న) నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం , పోలీసులు అనుమతి నిరాకరించారు. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో “తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ” పేరిట ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు జనసేన నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే కారణంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ బందోబస్తు విధులను అడ్డుగా చూపుతూ సైబరాబాద్ పోలీసులు ఈ సభకు అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. ప్రభుత్వం , పోలీసుల నిర్ణయంపై జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లు ముగియడంతో, ఈ వ్యవహారంపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. పోలీసుల నిరాకరణ ఉత్తర్వులను సవాలు చేస్తూ, సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జనసేన ముఖ్య నాయకులు అత్యవసరంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor