కరీంనగర్ · June 3, 2026

పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 03: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – పర్యావరణ వారోత్సవాల సమావేశం హుజూరాబాద్ రేంజ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి ప్రాథమిక బాధ్యత అని పిలుపునిచ్చారు.

చెట్లు మానవాళి మనుగడకు ప్రధాన ఆధారమని, అమ్మ మనకు ప్రాణం పోస్తే, చెట్లు మనకు జీవనాన్ని ఇస్తున్నాయని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో తప్పనిసరిగా మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణతో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ అటవీ శాఖ ప్రాధాన్యత కార్యక్రమంలో అటవీ క్షేత్రాధికారి బి. లత , జమ్మికుంట ఎఫ్.ఎస్.ఓ, ఎండి. హమ్మద్ హుస్సేన్ , హుజూరాబాద్ ఎఫ్.ఎస్.ఓ, పి. శ్రీనివాస్ , కేశపట్నం ఎఫ్.ఎస్.ఓ , వి. ఉదయ్ కుమార్ , హుజూరాబాద్ ఎఫ్.బి.ఓ నరేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor