తెలంగాణ · June 3, 2026

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ తీపి కబురు: 290 పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్ విడుదల

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్, జూన్ 03: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 290 ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో భాగంగా రోడ్లు, భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్ పోస్టులు, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి కూడా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల కోసం వేర్వేరు తేదీలను నిర్ణయించారు. సివిల్ ఇంజినీర్ పోస్టులకు ఈ నెల 6వ తేదీ నుంచి జులై 13వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులకు ఈ నెల 8వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఇక అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు జూన్ 10వ తేదీ నుంచి జులై 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అర్హత, వయోపరిమితి మరియు పరీక్షా విధానానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులందరూ టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in) ను సంప్రదించాలని కమిషన్ కార్యదర్శి ఎం. హరిత ఒక ప్రకటనలో వెల్లడించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor