బావిలో సముద్ర అలల తరహాలో నీటి కదలికలు: గుజరాత్‌లోని విర్పర్దాలో వింత ఘటన

0
IMG_20260807_143237

గుజరాత్ ,వి90 న్యూస్,ఆగస్టు 07: గుజరాత్‌లోని విర్పర్దా గ్రామంలో ఓ బావిలో నీరు సముద్ర అలల్లా ఉవ్వెత్తున కదులుతూ గ్రామస్థులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రైతు ప్రాంజీవన్ భాయ్ పొలంలో ఉన్న ఈ బావిలో మంగళవారం నీటి కదలికలు కొంతసేపు తగ్గినప్పటికీ, బుధవారం నాటికి మళ్లీ అదే రీతిలో అలలు ఎగసిపడటం ప్రారంభమైంది.బావిలోని రాతి పొరల మధ్య చిక్కుకున్న వాయువుల ఒత్తిడి కారణంగానే నీటిలో ఈ విధమైన కదలికలు ఏర్పడి ఉండవచ్చని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. బావిలో నీరు అలా ఉప్పొంగడానికి గల అసలు కారణాలను శాస్త్రీయంగా తెలుసుకునేందుకు అధికారులు నిపుణుల బృందంతో పరిశీలనలు జరుపుతున్నారు. కాగా, ఈ అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు తరలివస్తున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *