కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 02: ఇల్లంతకుంట మండలం మర్రివానిపల్లి గ్రామంలో జమ్మికుంటకు చెందిన ఆదిత్య , అమృత హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల శ్రీనివాస్ (జనరల్ మెడిసిన్), డాక్టర్ భరత్ (న్యూరాలజిస్ట్), డాక్టర్ గ్రీష్మ (గైనకాలజిస్ట్) పాల్గొని గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు ఉచితంగా షుగర్ పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

ప్రజా సంక్షేమం కోసం ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ కడారి పద్మ – నవీన్, వార్డు సభ్యులు జుజాటి శ్రీవాణి, ఎడ్ల చిరంజీవి, ఎరుబాటి నాగరాజు, రౌతు రాజేష్, కోడం సంజీవ్, బైరి రవీందర్, ఏనుగు శోభారాణిలతో పాటు ఇతర గ్రామ పెద్దలకు ఆదిత్య , అమృత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు మేలు చేకూరేలా మున్ముందు కూడా అనేక గ్రామాల్లో తమ ఉచిత వైద్య సేవలను విస్తరిస్తామని, ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో హాస్పిటల్ యాజమాన్యం ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.

