తెలంగాణ · September 16, 2026

ఈ నెల 17 నుండి ఉద్యమకారుల ఓదార్పు యాత్ర — ఐక్యవేదిక చైర్మన్ గుడిమల్ల రవికుమార్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హన్మకొండ,వి90 న్యూస్,సెప్టెంబర్ 16: హనుమకొండ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్య వేదిక చైర్మన్ గుడిమల్ల రవికుమార్ ముఖ్య విషయాలను వెల్లడించారు. ఉద్యమకారుల సమస్యలు, వారి బాధలను నేరుగా తెలుసుకునేందుకు ఈ నెల 17న వరంగల్ చౌరస్తా నుండి నిస్వార్థంగా ‘ఉద్యమకారుల ఓదార్పు యాత్ర’ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ యాత్ర ఏ కులానికి గానీ, ఏ రాజకీయ పార్టీకి గానీ సంబంధం లేదని స్పష్టం చేశారు.తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి జైలుకు వెళ్లిన వారితో పాటు, కేసులు కాకుండా మిగిలిపోయిన ఉద్యమకారులు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ యాత్రలో భాగంగా ఉద్యమకారుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారితో చర్చించి, అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటామని చెప్పారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ ఈ ఓదార్పు యాత్రలో భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor