తెలంగాణ · May 2, 2026

తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్.. ఈ నెలలోనే పెరగనున్న మద్యం ధరలు!

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్ మే 02 ; తెలంగాణలోని మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం చేదువార్త చెప్పేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెలలోనే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, కేటగిరీల వారీగా పెరగనున్న మద్యం ధరల అంచనా వివరాలు ఇలా ఉన్నాయి:

  • సాధారణ బ్రాండ్స్: ఫుల్ బాటిల్‌పై రూ. 60 పెంపు
  • ప్రీమియం బ్రాండ్స్: ఫుల్ బాటిల్‌పై రూ. 100 పెంపు
  • ఆ పై కేటగిరి బ్రాండ్స్: ఫుల్ బాటిల్‌పై ఏకంగా రూ. 120 వరకు ధర పెంచే యోచన

రాష్ట్ర ఖజానాకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ తాజా ధరల పెంపు ద్వారా ప్రభుత్వానికి ప్రతి నెలా సుమారు రూ. 250 కోట్ల అదనపు ఆదాయం వచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor