రంగారెడ్డి, వి90 న్యూస్,అక్టోబర్ 02: పుప్పాలగూడ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (AVOPA) శాఖ అధ్యక్షులు దారం వేణుమాధవ్ అధ్యక్షతన గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన అవోపా రాష్ట్ర అధ్యక్షులు మల్లిపెద్ది శంకర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొడ్డు శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మల్లిపెద్ది శంకర్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ తమ వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. గాంధీజీ చూపిన శాంతి, అహింసా మార్గాలను, ఆయన ఉన్నత ఆశయాలను సమాజంలో విస్తృతంగా వ్యాప్తి చేయడంలో ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని స్పష్టం చేశారు. ఈ నివాళి కార్యక్రమంలో పుప్పాలగూడ శాఖ ప్రధాన కార్యదర్శి దారం భానుచందర్, కోశాధికారి అప్పని యుగంధర్, ప్రతినిధులు పబ్బ మల్లేశం, అనుములపల్లి భాస్కర్, బూరుగు సాయిబాబా తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

