కరీంనగర్ · October 9, 2026

ఎంగిలిపూల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, అక్టోబర్ 09: తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలకు జమ్మికుంట పట్టణం సిద్ధమవుతోంది. రేపటి నుండి తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజైన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని బొమ్మల గుడి శివాలయం ఆవరణలో జమ్మికుంట ఆడపడుచులు సంతోషంగా బతుకమ్మ ఆడుకునేలా చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పండుగ రోజుల్లో మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చంద రాజు, మున్సిపల్ మేనేజర్ గుర్రాల రాజిరెడ్డి, ఏఈ వికాస్, శ్రీనులతో పాటు పలువురు నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor