కరీంనగర్ · October 11, 2026

మడిపల్లిలో ఘనంగా దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ: ఆధ్యాత్మిక శోభతో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/ అక్టోబర్ 11: జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో శివాలయం సమీపంలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన, దేవి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఎన్ఆర్ఐ (USA) నేరెళ్ల దామోదర్ గౌడ్ సౌజన్యంతో అందజేసిన దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించగా, స్వామివారితో పాటు ఆలయంలో దుర్గామాత మాల ధారణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సమర్పించే చీర, ముక్కుపుడకను డప్పు చప్పుళ్లు, డీజే పాటలు, కోలాట బృందాల ప్రదర్శనల నడుమ గ్రామంలో ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకొచ్చారు.

అనంతరం అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్ మేకమల్ల తిరుమల వెంకటేష్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూరి ప్రవీణ్ కుమార్, నాగపురి శ్రీనివాస్, దేవుని లోకేష్, అంబాల వినయ్, ఆర్. లోకేష్, మురళి, అరవింద్, రాకేష్, రాజేష్, వంశీ, వరుణ్, విక్రమ్, ఉదయ్ కిరణ్, రోహిత్, కంకణాల దేవదాస్ తదితర యువకులు, భక్తులు, గ్రామ పెద్దలు విశేషంగా పాల్గొన్నారు. భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడంతో మడిపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor