కరీంనగర్ · October 11, 2026

జమ్మికుంటలో ఘనంగా సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు ప్రారంభం: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/ అక్టోబర్ 11: తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుకలను జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా చివరి రోజైన సద్దుల బతుకమ్మను అక్కచెల్లెళ్లు సుఖసంతోషాలతో ఆడుకునేందుకు వీలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం , నాయిని చెరువు వద్ద మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) కొబ్బరికాయ కొట్టి పనులను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ప్రకృతిని, పూలను దైవంగా భావించి పూజించే ప్రత్యేకమైన పండుగ కేవలం తెలంగాణలోనే ఉందని కొనియాడారు. పట్టణంలోని 30 వార్డుల నుంచి వచ్చే మహిళలు, అక్కచెల్లెళ్లకు బతుకమ్మ వేడుకల సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించడం తమ పాలకవర్గ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor