తెలంగాణ · October 20, 2026

తెలుగు ప్రజలకు V90 డిజిటల్ న్యూస్ నెట్‌వర్క్ చైర్మన్ కందుకూరి రాజు విజయదశమి పండుగ శుభాకాంక్షలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/ అక్టోబర్ 20: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ V90 డిజిటల్ న్యూస్ నెట్‌వర్క్ చైర్మన్ కందుకూరి రాజు విజయదశమి పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలను, విజయాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ, గత 6 సంవత్సరాలుగా V90 డిజిటల్ న్యూస్ నెట్‌వర్క్‌ను నిరంతరం ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు, వీక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నమ్మకమే తమ నెట్‌వర్క్ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్న ఆయన, రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత చేరువై, వారి సమస్యలను వెలుగులోకి తెస్తూ, ప్రతిష్టాత్మకమైన వార్తా సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.2020లో అత్యంత నిబద్ధతతో ప్రారంభమైన V90 NEWS ప్రస్థానం, ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఎన్నో సవాళ్లను అధిగమించి దిగ్విజయంగా ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతమైన వార్తలతో డిజిటల్ మీడియా రంగంలో అత్యంత స్వల్ప కాలంలోనే V90 న్యూస్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపును ఏర్పరచుకుందని ఆయన వ్యాఖ్యానించారు.సమాజంలో జరుగుతున్న పరిణామాలను వేగంగా, పారదర్శకంగా అందించడంలో తమ టీమ్ నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు. ప్రస్తుతం V90 న్యూస్ ఛానెల్, V90 న్యూస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, నిజమైన వార్తలను వేగవంతంగా ప్రజలకు చేరవేస్తున్నామని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ డిజిటల్ మాధ్యమంలో మున్ముందు కూడా V90 డిజిటల్ న్యూస్ నెట్‌వర్క్ మరింత వినూత్న కార్యక్రమాలతో ప్రజల ముందుకు వస్తుందని భరోసా ఇచ్చారు. ఇష్టపడి ఆదరిస్తున్న వీక్షకులు, శ్రేయోభిలాషుల ఆదరాభిమానాలు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగాలని కందుకూరి రాజు మనస్ఫూర్తిగా కోరారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor