తెలంగాణ · October 26, 2026

బాణాసంచా విక్రయాలకు తాత్కాలిక అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలి: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

వరంగల్/వి90 న్యూస్/అక్టోబర్ 26: రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని తాత్కాలిక బాణాసంచా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు తగిన అనుమతులు పొందాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు. తాత్కాలిక షాపుల నిర్వహణకు ఆసక్తి ఉన్నవారు అవసరమైన ధ్రువపత్రాలతో కూడిన పూర్తి దరఖాస్తులను నవంబర్ 2వ తేదీలోపు సంబంధిత డీసీపీ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు తమ ఫామ్‌తో పాటు అగ్నిమాపక శాఖ జారీ చేసిన నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ), స్థల యజమాని లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి నుంచి పొందిన అనుమతి లేఖ, జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ , స్థలానికి సంబంధించిన బ్లూప్రింట్ (సైట్ ప్లాన్)ను తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది. గతంలో లైసెన్స్ పొంది ఉంటే దాని ప్రతిని, అవసరమైన చోట్ల పక్క స్థలాల యజమానుల అనుమతి పత్రాలను కూడా అందించాలని తెలిపారు. వీటితో పాటు ప్రభుత్వ ఖజానాకు రూ.800 చెల్లించినట్లుగా ఆదాలత్ శాఖలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన బ్యాంకు చలాన్‌ను కూడా దరఖాస్తుకు జతపరచాలి.వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిబంధనలకు లోబడి సంబంధిత డీసీపీ స్థాయి అధికారులు తాత్కాలిక అనుమతులను జారీ చేస్తారని కమిషనర్ వివరించారు. నిబంధనలను ఉల్లంఘించి, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా బాణాసంచా విక్రయాలు చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor