తెలంగాణ · October 29, 2026

వరంగల్‌లో జాతీయ ఐక్యత సందేశంతో 5కే, 10కే వాక్/రన్: సీపీ ఎన్. శ్వేత

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

వరంగల్/వి90 న్యూస్/అక్టోబర్ 29: సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఏక్తా దివస్ – జాతీయ ఐక్యత దినోత్సవం , విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ సందర్భంగా ఈ నెల 31వ తేదీన ఉదయం 6 గంటలకు హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి 5కే, 10కే వాక్/రన్ నిర్వహించనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. ఈ కార్యక్రమం శనివారం ఉదయం 6 గంటలకు హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ప్రారంభమై, మట్టేవాడ పోలీస్ స్టేషన్ వరకు చేరుకుని తిరిగి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకోవడంతో ముగుస్తుంది. ఈ వాక్/రన్‌లో పురుషులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు అందరూ పాల్గొనవచ్చని, విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన ఆసక్తిగలవారు https://docs.google.com/forms/d/e/1FAIpQLSccE57AVP9ejR0HACbXeVXtcZzPKxmPX-Ug109DyNr3X45M-Q/viewform లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor