తెలంగాణ · November 4, 2026

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆర్యవైశ్య మహిళకు కేటాయించాలి: AVOPA విజ్ఞప్తి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రంగారెడ్డి/వి90 న్యూస్/నవంబర్ 04: తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాన్ని ఆర్యవైశ్య సామాజికవర్గానికి, ప్రత్యేకించి మహిళకు కేటాయించాలని AVOPA (ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్) రంగారెడ్డి జిల్లా తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి , ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు.దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, పరోపకారం, దానగుణం , సేవాభావం కలిగిన ఆర్యవైశ్యులకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉన్నాయని పేర్కొన్నారు. చిన్న కిరాణా దుకాణాల నుంచి పెద్ద వాణిజ్య సంస్థల వరకు వ్యాపార రంగంలో కీలకపాత్ర పోషిస్తూ సమాజంలోను, ప్రజాజీవితంలోనూ గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.2014, 2018 , 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్యులకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించలేదని గుర్తుచేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పేద విద్యార్థులకు ఫీజుల సహాయం అందడం లేదని తెలిపారు. దివంగత కొణిజేటి రోశయ్య తదనంతరం కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్యులకు సరైన అవకాశాలు కల్పించలేదని వివరించారు.సమాజానికి , సంఘానికి ఆర్యవైశ్యులు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ, ఇప్పటికైనా ఆలోచించి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆర్యవైశ్య మహిళకు కేటాయించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కి విన్నవించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor