క్రైమ్ · November 4, 2026

యూట్యూబ్‌లో చూసి రూ. 6.78 కోట్ల నకిలీ నోట్ల తయారీ.. తెలంగాణలో భారీ ముఠా గుట్టురట్టు!

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్/వి90న్యూస్/నవంబర్ 04: తెలంగాణలో భారీగా నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న ఒక ముఠా గుట్టును ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు రట్టు చేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టిన సమయంలో కారులో ప్రయాణిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 8 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై నిర్వహించిన తదుపరి విచారణలో కుంట్లూరు కేంద్రంగా నకిలీ నోట్ల తయారీతో పాటు పంపిణీకి పథకం పన్నినట్లు తేలింది.తాజాగా చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్‌లో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ ఎస్‌వోటీ బృందాలు కలిసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దాడిలో తయారై పంపిణీకి సిద్ధంగా ఉన్న రూ. 6.78 కోట్ల విలువైన నకిలీ నోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠాలోని ప్రధాన నిందితుడు కర్ణాకర్ యూట్యూబ్, సోషల్ మీడియాలోని వీడియోలను చూసి నకిలీ నోట్ల తయారీ విద్యను నేర్చుకున్నట్లు గుర్తించారు. ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి మీడియా సమావేశంలో కేసు వివరాలను అధికారికంగా వెల్లడించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor