తెలంగాణ · November 9, 2026

రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డికి 6 నెలల జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్/వి90న్యూస్/నవంబర్ 09: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి తెలంగాణ హైకోర్టు 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 2,000 రూపాయల జరిమానా విధించింది. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ కొందరు బాధితులు 2025 ఆగస్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, 60 రోజుల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. అయితే, న్యాయస్థానం ఇచ్చి ఆదేశాలను నిర్ణీత గడువులోగా అమలు చేయకపోవడంతో దీనిని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం కోర్టు ధిక్కరణ కింద ఈ శిక్షను ఖరారు చేసింది. అనంతరం ఈ తీర్పుపై ఉన్నత స్థానంలో అప్పీల్ చేసుకునేందుకు కలెక్టర్‌కు వీలు కల్పిస్తూ జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor