తెలంగాణ · November 11, 2026

కాజీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హన్మకొండ/వి90 న్యూస్/నవంబర్ 11: హనుమకొండ జిల్లా కాజీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ప్రపంచస్థాయిలో రాణించాలన్నదే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.మహాత్మా గాంధీ స్ఫూర్తితో, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఆధునిక డిజిటల్ విద్య, ఉచిత రవాణా, పౌష్టికాహార వసతులతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను సెమీ-రెసిడెన్షియల్ విధానంలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

కుల, మత, వర్గ భేదాలకు తావులేకుండా విద్యార్థులందరూ ఒకే చోట అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనభ్యసించేలా 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.

దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన ఉదయపు అల్పాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తూ తెలంగాణ పిల్లలను గ్లోబల్ స్థాయిలో తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని, ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న ఈ అద్భుత అవకాశాలను తల్లిదండ్రులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor