కరీంనగర్ · November 14, 2026

నెలైనా గడవకముందే పగుళ్లు బారిన సీసీ రోడ్డు.. రూ. 10 లక్షల ప్రజాధనం వృథా!

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/ నవంబర్ 14: కాంట్రాక్టర్ల ధన దాహం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి గ్రామాల్లో వేస్తున్న సీసీ రోడ్లు మూడు నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. నాణ్యతకు తిలోదకాలిస్తూ ఆగమాగంగా పనులు చేస్తుండటంతో, నెల రోజులు కూడా గడవకముందే రోడ్లు పగుళ్లు బారి అక్కరకు రాకుండా పోతున్నాయి.జమ్మికుంట మండలం నగురం గ్రామంలో మహాత్మా గాంధీ యువజన జనరల్ ఫండ్ కింద రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పదికాలాల పాటు మన్నికగా ఉండాల్సిన ఈ రహదారి, నిర్మాణం పూర్తయిన నెలలోపే తీవ్రంగా దెబ్బతింది. రోడ్డు పైపొర పూర్తిగా ఊడిపోయి, సిమెంట్ పొడిలా రాలిపోతూ అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి నెలకొంది. వేసవి ఎండల తీవ్రత పెరిగితే ఈ పగుళ్లు మరింత విస్తరించి, రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పనులు జరిగే సమయంలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడంతోనే కాంట్రాక్టర్లు నాసిరకం మెటీరియల్ వాడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని, లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ నాసిరకం పనులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడంతో పాటు నాణ్యతా ప్రమాణాలతో రోడ్డును పునర్నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor