కరీంనగర్ · November 14, 2026

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.. ‘బాల్య వివాహ రహిత భారత్’ పోస్టర్ ఆవిష్కరణ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/వి90 న్యూస్/నవంబర్ 14: కరీంనగర్ జిల్లా మహిళా , శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ అశ్విని చేతుల మీదుగా ‘బాల్య వివాహ రహిత భారత్’, ‘స్టాప్ చైల్డ్ మ్యారేజ్’ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పిల్లల హక్కుల పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూవో) సరస్వతి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) వై. తిరుపతి రావు, డీసీపీవో పర్వీన్, డీఎంహెచ్‌వో, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ఆవుల సంపత్ పాల్గొన్నారు. వీరితో పాటు సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎస్ఆర్‌డీ) కరీంనగర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మీరుపురి వెంకటేష్, కమ్యూనిటీ సోషల్ వర్కర్లు గాజంగి వీరస్వామి వీరన్న, పాపినేని కోమల, జిల్లా సీడీపీవోలు , పలు పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor