కరీంనగర్/హుజురాబాద్/వి90 న్యూస్/ నవంబర్ 14: తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారిగా హుజురాబాద్ మండలం కనుకుల గిద్ద గ్రామానికి చెందిన కానిగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. రాష్ట్ర సగర సంఘం కార్యవర్గం ఆమోదించిన తీర్మానం మేరకు ఆయనను ఈ పదవిలో నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం ప్రకటించారు. గత అనేక సంవత్సరాలుగా సగర కుల అభ్యున్నతి, హక్కుల సాధన కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఆయన, గతంలో కరీంనగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా విశేష సేవలందించారు. సంఘం బలోపేతానికి ఆయన చేసిన కృషిని గుర్తించిన రాష్ట్ర నాయకత్వం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.ఈ సందర్భంగా కానిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్ర కోశాధికారిగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, ముఖ్య సలహాదారు ఆర్.బి. ఆంజనేయులు సగరతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కరీంనగర్ జిల్లా , అన్ని జిల్లాల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాయకత్వం ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సంఘం అభివృద్ధికి, సగర కులస్తుల సంక్షేమానికి మరింత కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

