కరీంనగర్ · November 19, 2026

వార్డులో ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/నవంబర్ 19: వార్డులోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని జమ్మికుంట మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ తూర్పాటి చందన శంకర్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు.గురువారం వార్డులో నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు ఆమె స్వయంగా మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం వారి జీవనానికి ఎంతో తోడ్పాటుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు, అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో పథకాలు అందని వారి వివరాలను సేకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.ప్రజాప్రతినిధిగా పదవిలో ఉన్నంతకాలం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వార్డు అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమప్రాధాన్యత ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. పెన్షన్ మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor