మంత్రి పొన్నం ప్రభాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు

0
IMG-20260508-WA0050

హుస్నాబాద్,V90 NEWS, మే 08: రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు హుస్నాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హుస్నాబాద్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జమ్మికుంట మాజీ సర్పంచ్, పార్టీ సీనియర్ నాయకులు పొనగంటి మల్లయ్య పటేల్ ఆధ్వర్యంలో మంత్రికి పూలబొకేలు అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే కాలంలో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని వారు ఆకాంక్షించారు.మంత్రిని కలిసిన వారిలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పొనగంటి రవీందర్, జమ్మికుంట మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ పొనగంటి విష్ణువర్ధన్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు , పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తమను సాదరంగా ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట , హుస్నాబాద్ నియోజకవర్గాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు వెల్లువలా కురిపించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed