జాతీయం · October 12, 2026

ఓట్ల తొలగింపు ముమ్మాటికి రాజకీయ కుట్ర: వొడితల ప్రణవ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

న్యూ ఢిల్లీ/వి90 న్యూస్/అక్టోబర్ 12:దేశంలో రాహుల్ గాంధీకి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓటమి భయంతోనే బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతోందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ నుండి సుప్రీంకోర్టు వరకు ఇండియా విపక్ష కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన “మార్చ్ ఫర్ డెమోక్రసీ” శాంతియుత ర్యాలీలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన అత్యంత కీలకమైన ఓటు హక్కును హరించడం ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ప్రత్యక్ష దాడేనని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీకి కొమ్ముకాస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

ఓట్ల తొలగింపులో అక్రమాలకు పాల్పడుతున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ఓటు చోరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై ఆధారాలతో సహా వివరించినప్పటికీ, ప్రధాన ఎన్నికల కమిషన్‌పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో స్పష్టం చేయాలని నిలదీశారు. అంతకుముందు బారాఖంభా మెట్రో స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కూడా ఆయన భాగస్వాములయ్యారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor