జాతీయం · October 13, 2026

ఢిల్లీలో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ భారీ నిరసన: పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

న్యూఢిల్లీ,వి90 న్యూస్,అక్టోబర్ 13: అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేపట్టిన ఎస్‌ఐఆర్‌ (SIR) వ్యతిరేక నిరసన కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌లతో కలిసి పాల్గొన్న ఆయన ఓటు హక్కుల పరిరక్షణకు తమ నిబద్ధతను చాటారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు జైరాం రమేష్, రమేష్ చెన్నితలతో ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాజ్యాంగ విలువల గౌరవం, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత వంటి పలు కీలక అంశాలపై అగ్రనేతలతో చర్చించారు.


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరుకు కూడా అన్యాయం జరగకూడదని, ప్రతి పౌరుడికి ఓటు హక్కు లభించేలా చూడాలని నేతలు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కని, ప్రతి అర్హుడి ఓటును కాపాడినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలగాలంటే ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. అర్హులైన పౌరుల ఓటు హక్కుల కోసం, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని వారు తేల్చిచెప్పారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor