భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ షెడ్యూల్ విడుదల

0
IMG-20260731-WA0048

భోగాపురం,వి90 న్యూస్,జూలై 31: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి ఆగస్టు 17వ తేదీ నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా అక్టోబర్ 24వ తేదీ వరకు తమ ఫ్లైట్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. నూతనంగా అందుబాటులోకి వస్తున్న ఈ సర్వీసులలో భాగంగా హైదరాబాద్-భోగాపురం మార్గంలో రోజుకు ఐదు సర్వీసులను, విజయవాడ-భోగాపురం మధ్య రోజుకు నాలుగు సర్వీసులను నడపనున్నట్లు సంస్థ వెల్లడించింది. అలాగే బెంగళూరు-భోగాపురం మార్గంలో రోజుకు రెండు సర్వీసులతో పాటు శుక్ర, ఆదివారాలు మినహా మిగిలిన ఐదు రోజులలో మూడో సర్వీసును కూడా నిర్వహించనున్నట్లు ఎయిరిండియా ప్రతినిధులు తెలియజేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *